
పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు
● ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ఎం. శ్రీనివాసులు
చిలమత్తూరు: ప్రజాస్వామ్యంలో పత్రికలది కీలక భూమికని, ఎన్నో కష్టాలకోర్చి ప్రజా సమస్యలపై పోరాడే పాత్రికేయరంగంపై కక్ష సాధింపు చర్యలు ఒక విధంగా ప్రజాస్వామ్యానికి పెనుముప్పగా భావించాల్సి వస్తుందని ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. శ్రీనివాసులు అన్నారు. పాత్రికేయులు, ఎడిటర్లపై దాడులు, కేసులు అప్రజాస్వామికమన్నారు. ఇది దేశ భవిష్యత్‌కు ప్రమాదకరమన్నారు. ఎలాంటి వారెంట్ లేకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసుల తీరును ఆయన ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాల్సిన తరుణంలో ఇలాంటి చర్యలకు దిగడం సిగ్గుచేటన్నారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దు
● వాహనాల స్పెషల్ డ్రైవ్‌లో ఎస్పీ రత్న
పుట్టపర్తి టౌన్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సీ రత్న హెచ్చరించారు. గురువారం రాత్రి 10గంటల సమయంలో ఎస్పీ స్వయంగా ధర్మవరం – కోడూరు ప్రధాన రహదారిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు పేర్కొన్నారు. గంజాయి. ఇతర మాదక ద్రవ్యాలు అక్రమ రవాణ, మద్యం సేవించి వాహనాలు నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, పెండింగ్ చలానాలు, తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయకుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ సురేష్, ఎస్‌ఐ లింగన్న, సిబ్బంది పాల్గొన్నారు.

పత్రికా స్వేచ్ఛను హరించడం సరికాదు