
● చెన్నకేశవా..గోవింద
ధర్మవరం అర్బన్: లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మవరం గోవింద నామస్మరణతో మార్మోగుతోంది. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం లక్ష్మీచెన్నకేశవస్వామి ఉదయం సర్వభూపాల వాహనం, సాయంత్రం సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ఉదయం స్వామివారి మూలవిరాట్‌ను ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. అనంతరం అర్చకులు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని సర్వభూపాల వాహనంపై కొలువుదీర్చి పూజలు చేశారు. సాయంత్రం సింహ వాహనంపై కనిపించిన లక్ష్మీచెన్నకేశవ స్వామిని చూసి భక్తులు తరించారు. గోవింద నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక సాగరంలో మునిగిపోయారు. కాగా, బుధవారం లక్ష్మీచెన్నకేశవస్వామి కల్పవృక్ష, హనుమద్ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

● చెన్నకేశవా..గోవింద

● చెన్నకేశవా..గోవింద