
జేఎన్‌టీయూ గౌరవ డాక్టరేట్‌కు చావా ఎంపిక
అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం 14వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ కోసం డాక్టర్ సత్యనారాయణ చావాను ఎంపిక చేశారు. లారస్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సీఈఓగా ఉన్న డాక్టర్ సత్యనారాయణ చావాకు గౌరవ డాక్టరేట్ అందించాలని చాన్సలర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆదేశాలు జారీ చేశారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఎం.ఆర్.మాధవ్ ఎమిరటర్స్ ప్రొఫెసర్, ఐఐటీ కాన్పూర్ ను ఎంపిక చేశారు. మే 17న స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నారు. గవర్నర్, వర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారు.
చావా విజయ ప్రస్థానం..
లారస్ ల్యాబ్స్ కంపెనీ ఏర్పాటైన 18 ఏళ్లలో ఇప్పటి వరకు 150 కొత్త మందులు కనిపెట్టారు. 150 పేటెంట్లు దక్కాయి. రెస్పెక్ట్.. రివార్డు..రీటైయిన్ అనే మూడు స్తంభాలపై ల్యాబ్స్ నిర్మాణం జరిగింది. నాలుగో స్తంభం డాక్టర్ చావా సత్యనారాయణ. ర్యాన్‌బ్యాక్సీలో యువ పరిశోధకుడిగా డాక్టర్ సత్యనారాయణ విజయ ప్రస్థానం మొదలైంది. మ్యాట్సిక్స్‌లో చేరిన 8 సంవత్సరాలకే ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఎదిగారు. లారస్ ల్యాబ్ స్థాపన (2005) (హైదరాబాద్)తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి పితామహులు, దిశాదర్శకులు అయ్యారు. సాక్షి 2021 సంవత్సరంలో ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఆయన్ని ఘనంగా సత్కరించింది.