
● వాసవీమాతకు లక్ష గాజులతో పూజలు
హిందూపురం: పట్టణంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి మూలవిరాట్‌ను స్వర్ణతోరణ కవచధారణ చేసి విశేష పూజలు చేశారు. అలాగే వాసవీమాత జయంత్యుత్సవాల్లో భాగంగా వాసవీమాత విగ్రహానికి వందలాది మంది మహిళలు గాజులతో పూజలు చేశారు. అంతకుముందు ఆలయంలో కలశస్థాపన, గోపూజ, సువర్ణ్ణ వాసవీమాత విగ్రహ ప్రాణప్రతిష్ట, నవగ్రహ పూజ, మృత్యుంజయ హోమం నిర్వహించారు. వాసవీ భజన బృందం సభ్యులు అమ్మవారికి లక్ష గాజులతో పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాము, కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి రవీంద్రుడు, పలువురు కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

● వాసవీమాతకు లక్ష గాజులతో పూజలు

● వాసవీమాతకు లక్ష గాజులతో పూజలు