
శ్రమదానం చేస్తున్న ఇన్‌చార్జ్ జేసీ కార్తీక్, జిల్లా అధికారులు
పుట్టపర్తి అర్బన్: ప్రజలందరి సహకారంతోనే రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని ఇన్‌చార్జ్ జేసీ కార్తీక్ తెలిపారు. ‘స్వచ్ఛతా హి సేవ’లో భాగంగా ఆదివారం పుట్టపర్తి సమీపంలోని చిత్రావతి పరివాహక ప్రాంతం, బైపాస్ రోడ్డు వెంబడి ‘ఏక్ దిన్ ఏక్ గంట’ శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఇన్‌చార్జ్ జేసీ కార్తీక్, డీఆర్‌ఓ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ, మున్సిపల్ చైర్మన్ తుంగ ఓబుళ పతి, వైస్ చైర్మన్ మాతంగి తిప్పన్న, కమిషనర్ మధుసూదనరెడ్డి, జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి ఉదయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. చెత్త ఊడ్చి పిచ్చి మొక్కలు తొలగించారు. అంతకు ముందు పట్టణంలోని ప్రధాన వీధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ జేసీ కార్తీక్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజం ఆవిష్కృతమయ్యేలా అధికారులు, ప్రజలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య శాలలు, ప్రైవేటు సంస్థల పరిసరాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, ఇందులో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. కాగా, జిల్లా స్థాయి అధికారులంతా చీపుర్లు పట్టి చెత్త ఊడుస్తుండడం చూసి పలువురు పట్టణ వాసులు సైతం చేయి కలిపారు. కాలువ పూడిక తీత పనుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో డీపీఎంఓ కుల్లాయప్పనాయక్, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ జేసీ కార్తీక్