
మృతి చెందిన మేకలను చూపుతున్న రామ్మోహనాచారి
ముదిగుబ్బ: ప్రమాదవశాత్తు విషం కలిపిన నీరు తాగి మేకలు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన మేరకు... ముదిగుబ్బ మండలం ఎస్.బ్రాహ్మణపల్లికి చెందిన రామ్మోహనాచారి మేకల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం మేకలను మేపునకు సమీపంలోని అటవీ ప్రాంతానికి తోలుకెళ్లాడు. మధ్యాహ్నం సమీపంలోని తోటలోకి వెళ్లిన మేకలు.. అక్కడ డ్రమ్ములో పంట పొలాలకు పిచికారీ చేసేందుకు క్రిమి సంహారక మందు కలిపిన నీటిని తాగాయి. ఘటనలో 15 మేకలు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్లు కాపరి రామ్మోనాచారి వాపోయాడు. బాధితుడిని ఆదుకోవాలని ఈ సందర్భంగా అధికారులను స్థానికులు కోరారు.