అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఫిబ్రవరి, మార్చి – 2023లో నిర్వహించిన బీఫార్మసీ మొదటి సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–15), (ఆర్–19), రెండో సెమిస్టర్ (ఆర్–15), (ఆర్–19) సప్లిమెంటరీ ఫలితాలు, ఫార్మా డీ మొదటి సంవత్సరం (ఆర్–14) సప్లిమెంటరీ, ఎం ఫార్మసీ మూడో సెమిస్టర్ (ఆర్–17) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదలయ్యాయి. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఈ.కేశవ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ బి.చంద్రమోహన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష ఫలితాల కోసం జేఎన్‌టీయూ (ఏ) వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
ప్రశాంతి నిలయం: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శనివారం 99 కేంద్రాల్లో జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు 974 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 28,866 మందికి గాను 28,064 మంది హాజరయ్యారు. 802 మంది గైర్హాజరయ్యారు. ఇక ఒకేషనల్ విద్యార్థులు 2,705 మందికి గాను 2,533 మంది పరీక్షలు రాయగా, 172 మంది గైర్హాజరయ్యారు.
కేజీబీవీల్లో ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంతి నిలయం: జిల్లాలోని 30 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించి 6, 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ అధికారి, డీఈఓ మీనాక్షి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 20వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులు http://apkgbv.apcfss.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. అనాథలు, పాక్షిక అనాథలు, బడి బయట ఉన్న పిల్లలు, డ్రాపౌట్స్ బాలికలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వలస కుటుంబాలకు చెందిన పిల్లలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బాలికలు అర్హులన్నారు. 6వ తరగతి, ఇంటర్‌తో పాటు 7, 8 తరగతులలో మిగిలిన సీట్లకు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. ఎంపికై న వారికి ఫోన్ ద్వారా సమాచారం అందుతుందన్నారు.