నేదురుమల్లితో ప్రసన్న భేటీ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డితో నగరంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపే అంశమై చర్చించారు. పార్టీ చిల్లకూరు మండల కన్వీనర్ మధురెడ్డి, మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి, చిట్టమూరు రాజారెడ్డి, పలగాటి సంపత్‌కుమార్‌రెడ్డి, వీరి చలపతిరావు, కొండూరు అనిల్‌బాబు, నల్లపరెడ్డి రాజేంద్రకుమార్‌రెడ్డి, కలువ బాలశంకర్‌రెడ్డి, చిల్లకూరు సాయిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
కార్గో హ్యాండ్లింగ్‌లో రికార్డు
ముత్తుకూరు(పొదలకూరు): కృష్ణపట్నం పోర్టులో మెకనైజ్డ్ బెర్త్‌లో ఒక్క రోజులోనే 1,32,800 మెట్రిక్ టన్నుల కార్గోను హ్యాండ్లింగ్ చేశారు. దీంతో సరికొత్త రికార్డును నెలకొల్పామని సీఈఓ జగదీష్ పటేల్ బుధవారం పేర్కొన్నారు. నెలవారీ ఎరువులను 0.43 ఎమ్మెమ్టీలను విజయవంతంగా నిర్వహించి, గతేడాది డిసెంబర్ కంటే అధిక ప్రగతిని సాధించామని వెల్లడించారు.
క్షేమంగా ఉన్నా.. ఎవరూ ఆందోళన చెందొద్దు
కావలి(అల్లూరు): తాను క్షేమంగా ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందొద్దని.. త్వరలోనే మీ ముందుకొస్తానని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనను బుధవారం విడుదల చేశారు. బైపాస్ సర్జరీ విజయవంతంగా జరిగిందని, ఇప్పుడు క్షేమంగా ఉన్నానని చెప్పారు.
రక్త పరీక్షలను
సకాలంలో చేయాలి
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు.. రక్త పరీక్షలను సకాలంలో చేయాలని డీఎంహెచ్‌ఓ సుజాత సూచించారు. సంతపేటలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్లతో బుధ వారం నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. నాణ్యతతో కూడిన రక్త పూతలను సేకరించి మలేరియా, ఫైలేరియా కేసులను నిర్ధారించాలని కోరారు. పరీక్ష ఫలితాలను ఆన్‌లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఏడీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ, జిల్లా మలేరియా నివారణాధికారి హుస్సేనమ్మ, సహాయ మలేరియా నివారణాధికారి నాగార్జునరావు పాల్గొన్నారు.
నేదురుమల్లితో ప్రసన్న భేటీ
నేదురుమల్లితో ప్రసన్న భేటీ


