కోనలో వైభవంగా హనుమద్వ్రతం
రాపూరు: హనుమద్వ్రతం పురస్కరించుకుని జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో బుధవారం ఆంజనేయస్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. పెంచలకోన క్షేత్రంలో పెనుశిల లక్ష్మీనరసింహ స్వామికి అభిముఖంగా ఉన్న క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి మూలమూర్తికి ఉదయం పాలు, తేనె, పెరుగు, పంచామృతాలతో అభిషేకం, పూలంగిసేవ నిర్వహించారు. 8 గంటలకు తిరుచ్చిపై స్వామి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి వివిధ రకాలు ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలకరించారు. వేదపండితులు ఆస్థాన సేవ నిర్వహిచారు.


