
లడ్డూను దక్కించుకున్న ముసలయ్య
ఆత్మకూరు: పట్టణంలోని నారాయణరావుపేటలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహం వద్ద లడ్డూ ప్రసాదం వేలం పాటను గురువారం నిర్వహించారు. పోటాపోటీగా సాగిన వేలంలో స్థానికుడైన ముసలయ్య కుటుంబ సభ్యులు రూ.1,32,001కు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టారు.
వైఎస్సార్‌సీసీ న్యాయవిభాగ జోనల్ ఇన్‌చార్జిగా రోజారెడ్డి
నెల్లూరు (లీగల్): వైఎస్సార్‌సీపీ న్యాయవిభాగ జోనల్ ఇన్‌చార్జిగా రామిరెడ్డి రోజారెడ్డి, జిల్లా విభాగ అధ్యక్షుడిగా వై మురళీధర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
24న సాఫ్ట్‌బాల్ జట్ల
ఎంపికలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఈనెల 24న నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా సాఫ్ట్‌బాల్ సీనియర్ పురుష, మహిళా జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మలిరెడ్డి కోటారెడ్డి, సీహెచ్ కామేశ్వరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న జట్లు అక్టోబర్ మొదటి వారంలో కర్నూలులో జరిగే పదో సీనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొంటాయని చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్‌కార్డు, ఆరు పాస్‌ఫొటోలతో ఉదయం పది గంటలకు ఎంపికలకు హాజరుకావాలని కోరారు. వివరాలకు 97036 54315, 80742 99670 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
నేడు చేజర్లలో
‘జగనన్నకు చెబుదాం’
నెల్లూరు(దర్గామిట్ట): ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ గురువారం తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరై ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలోనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ పింఛనర్ల సమావేశం రేపు
నెల్లూరు(బృందావనం): రాష్ట్ర ప్రభుత్వ పింఛనర్ల సర్వసభ్య సమావేశాన్ని భక్తవత్సలనగర్‌లోని పింఛనర్ల సంక్షేమ భవనంలో శనివారం సాయంత్రం నిర్వహించనున్నామని అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గౌస్, ఎస్పీవీఎన్ మూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దంత సంరక్షణపై సూచనలు, సలహాలతో పాటు పరీక్షలను ఇందిర మల్టీ స్పెషాల్టీ దంత వైద్యశాల అధినేత వివేకానందరెడ్డి నిర్వహించనున్నారని చెప్పారు.