
బుచ్చిరెడ్డిపాళెం : వైఎస్సార్‌సీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పెనుబల్లిలో బుధవారం ఆయన మాట్లాడారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదని, ఆ 40 మంది పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో ఎన్టీఆర్‌ను దించాలని రామోజీరావుతో పచ్చపత్రికలో ఎమ్మెల్యేలంతా తన వైపు ఉన్నారని చెప్పుకున్నారని, ప్రస్తుతం అదేలా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కూడా తనతో ఉన్నారని బాబు మైండ్‌గేమ్ ఆడుతున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబును నమ్మి ఎవరూ వెళ్లరని తెలిపారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అమ్ముడుపోగానే అందరూ వచ్చేస్తారనే భ్రమలో టీడీపీ ఉందని పేర్కొన్నారు.