చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

చర్యలు తీసుకోవాలి

Mar 29 2023 12:34 AM | Updated on Mar 29 2023 12:34 AM

- - Sakshi

కలెక్టర్‌ చొరవ తీసుకుని మర్రిపాడులో ఉపాధి పనుల్లో అక్రమాలపై విచారణ చేయించాలి. చనిపోయిన వారు, ఉద్యోగులు, విద్యార్థుల పేరుతో డబ్బు దోచుకుంటున్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ షాజహాన్‌పై చర్యలు తీసుకోవాలి.

– ముడి మల్లికార్జునరెడ్డి,

ఎంపీటీసీ సభ్యుడు, మర్రిపాడు

విధుల నుంచి తొలగించాలి

నిరుపేదలకు ఉపయోగపడాల్సిన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్‌ షాజహాన్‌ను విధుల నుంచి వెంటనే తొలగించాలి. అతను ఓ బ్యాంకులో సైతం ప్రైవేట్‌ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. అధికారులు చర్యలు తీసుకోవాలి.

– ఎం.సురేష్‌, సర్పంచ్‌, మర్రిపాడు

విచారణ జరిపిస్తాం

ఇటీవల జరిగిన ఉపాధి హామీ సామాజిక తనిఖీల్లో మర్రిపాడు గ్రామ పంచాయతీ ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ షాజహాన్‌పై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేయించి చర్యలు తీసుకుంటాం.

– గోపి, ఎంపీడీఓ, సంగం

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement