
● కోవూరు ఎమ్మెల్యే
ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం
కోవూరు(విడవలూరు): ‘నా చివరి రక్తపు బొట్టు వరకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే ప్రయాణం సాగిస్తా. ఆయన వెంటే మా కుటుంబం నడుస్తుంది.’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. విడవలూరు మండలం ఆంజనేయపురంలో మంగళవారం ఆయ న విలేకరుల సమావేశంలో మాట్లా డారు. కొన్ని యూట్యూబ్ చానల్స్ పనికట్టుకొని నేను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఈ విషయం ఎంతగానో బాధించిందన్నారు. కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ నిధులిచ్చారన్నారు. తన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరును నెల్లూరు బ్యారేజీకి పెట్టారన్నారు. అంతటి గొప్ప వ్యక్తిని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. నేను జీవించినంత కాలం జగన్‌తోనే సాగుతానని.. నా మరణానంతరం నా కుమారుడు రజిత్‌కుమార్‌రెడ్డి కూడా ఆయన వెంటే నడుస్తారన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ టికెట్ మీద పోటీ చేసిన వారమంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మతోనే గెలిచామన్నారు. ఆయన బొమ్మ లేకుండా ఏ ఒక్కరు గెలిచే ప్రసక్తే లేదన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబునా యుడు మైండ్‌గేమ్ ఆడుతున్నాడని అందులో భాగంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.