
డీకేడబ్ల్యూ కాలేజీ వద్ద విద్యార్థినుల ఆనందం
పాఠాలు వినడం.. డౌట్స్ అడగడం.. చదువుకోవడం.. టెస్ట్‌లు రాయడం.. మార్కులు చూసుకోవడం.. ఏదైనా సబ్జెక్ట్‌లో
వెనుకబడి ఉంటే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టడం.. సంవత్సరమంతా ఇలా గడిపిన విద్యార్థులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు మంగళవారం ముగిశాయి. నెల్లూరులోని పరీక్ష కేంద్రాలు విద్యార్థుల కేకలు,
కేరింతలతో సందడిగా కనిపించాయి. హాస్టళ్లు, ఇళ్లలో పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులకు కొద్దిరోజులపాటు సరదాగా
గడిపేందుకు సమయం దొరికింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
