
ఓబయ్యను సన్మానిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు
నెల్లూరు(సెంట్రల్): జిల్లాకు సంబంధించి వ్యవసాయశాఖకు అనుబంధంగా ఉన్న ఏరువాక కేంద్రాన్ని జిల్లా నుంచి బాపట్ల జిల్లాకు మారుస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ సుధాకర్‌రాజు తెలిపారు. స్థానిక మద్రాసు బస్టాండ్ ప్రాంతంలో ఉన్న రైతుశిక్షణ కేంద్రంలో ఏరువాక కేంద్రం జిల్లా అధికారి ఓబయ్యను మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం నెల్లూరులోని ఏరువాక కేంద్రాన్ని ఉన్నతాధికారులు ఆదేశాలతో ఏప్రిల్ నుంచి బాపట్ల జిల్లాకు మారుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ శాఖ అధికారులు సురేఖాదేవి, శివన్నారాయణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.