
80 కేజీలు ఫ్రీజర్‌లోని చికెన్‌ను, తేదీలు లేకుండా విక్రయిస్తున్న ఐస్‌క్రీమ్, స్వీట్స్
నెల్లూరు సిటీ: మురళీకృష్ణ హోటల్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించిన నగరపాలక సంస్థ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ హోటల్ ను సీజ్ చేసి రూ.లక్ష జరిమానా విధించారు. నగరంలోని మద్రాసు బస్టాండ్ ప్రాంతంలోని మురళీకృష్ణ హోటల్‌లో శనివారం ఎంహెచ్‌ఓ ఆకస్మిక దాడులు నిర్వహించారు.
దాదాపు 80 కేజీలు ఫ్రీజర్‌లోని చికెన్‌ను, తేదీలు లేకుండా విక్రయిస్తున్న ఐస్‌క్రీమ్, స్వీట్స్, స్నాక్స్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. హోటల్ యజమానికి రూ.లక్ష జరిమానా విధించారు. ఈ క్రమంలో ఎంహెచ్‌ఓకు, హోటల్ నిర్వాహకులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. కార్యక్రమంలో శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.