
మందులను పరిశీలిస్తున్న జేడీ
● జేడీ మహేశ్వరుడు
నెల్లూరు(సెంట్రల్) : జిల్లాలో మూగజీవాలకు పంపిణీ చేయాల్సిన రూ.కోటి విలువైన వివిధ రకాల మందులను పలు నియోజకవర్గాలకు సరఫరా చేసినట్లు పశుసంవర్థకశాఖ జేడీ మహేశ్వరుడు పేర్కొన్నారు. నెల్లూరులోని ఆయన కార్యాలయంలో గోడౌన్ నుంచి మందులను కందుకూరు, నెల్లూరు, కావలి నియోజకవర్గాలకు బుధవారం సరఫరా చేశారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ జిల్లాలోని 175 పశుసంవర్థక వైద్యశాలలకు సంబంధించి మందులను సరఫరా చేస్తున్నామన్నారు. మూగజీవాల వైద్యం కోసం అవసరమైన అన్నిరకాల మందులను ఉచితంగా ఇస్తామన్నారు.