IPL 2023 RR Vs CSK: Winning This Game Was Needed For The Team Atmosphere Says Sanju Samson - Sakshi
Sakshi News home page

IPL 2023 RR Vs CSK: అందుకే ఆ పని పనిచేశా.. అతడు మాకు దొరికిన విలువైన ఆస్తి: శాంసన్‌

Apr 28 2023 12:38 PM | Updated on Apr 28 2023 1:17 PM

Winning this game was needed for the team atmosphere says Sanju Samson - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో భాగంగా జైపూర్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల తేడాతో రాజస్తాన్‌ విజయం సాధించింది. దీంతో ఈ మెగా ఈవెంట్‌ పాయింట్ల పట్టికలో రాజస్తాన్‌ రాయల్స్‌ అగ్రస్థానానికి దూసుకువెళ్లింది. ఇక సీఎస్‌కే విజయంపై మ్యాచ్‌ అనంతరం రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ స్పందించాడు.  జైపూర్‌లో తమ మొదటి విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది అని సంజూ తెలిపాడు.

"ఈ విజయం మా శిబిరంలో మరింత ఊత్సహాన్ని నింపింది. ఎందుకంటే వరుసగా మేము రెండు ‍మ్యాచ్‌ల్లో ఓడి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాం. అదే విధంగా జైపూర్‌లో మా మొదటి విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. గత రెండు రోజులుగా మేము ఇక్కడ ప్రాక్టీస్‌ చేశాం. ఇక్కడి పరిస్థితులకు తగ్గట్టు ముందు బ్యాటింగ్‌ ఎంచుకున్నాను. 

చదవండి: IPL 2023: బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.. రాజస్తాన్‌కు దొరికిన ఆణిముత్యం!

అదే వాంఖడే గానీ, చిన్నస్వామి స్టేడియంలో అయితే నేను తొలుత బౌలింగ్‌ ఎంచుకునేవాడిని. ఇక మా బ్యాటింగ్‌లో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. మా బాయ్స్‌ దూకుడుగా ఆడారు. వాళ్లకు ఆ స్వేచ్చ ఇచ్చిన జట్టు మేనెజ్‌మెంట్‌,  సపోర్ట్ స్టాఫ్‌కు క్రెడిట్‌ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇక జైశ్వాల్‌ గురించి ఎంత చెప్పుకున్న తక్కువ. అతడు మా జట్టుకు దొరికిన విలువైన ఆస్తి. ప్రతీ సీజన్‌లోనూ తానేంటో నిరూపించుకుంటున్నాడు పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో శాంసన్‌ పేర్కొన్నాడు.
చదవండి: SL vs IRE: చరిత్ర సృష్టించిన జయసూర్య.. 71 ఏళ్ల వరల్డ్‌ రికార్డు బద్దలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement