
PC: Virat Kohli Instagram
విరాట్ కోహ్లికి ప్రైవేట్ జెట్ ఉందా? విరాట్ కోహ్లి బ్లాక్ వాటర్ తాగుతాడా?
Virat Kohli: ఆధునిక క్రికెట్ యుగంలో ఎక్కువ మంది అభిమానులను కలిగి ఉన్న క్రికెటర్ ఎవరా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లి. టీమిండియా సారథిగా... ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకున్నాడు ఈ రన్‌మెషీన్. ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక సెలబ్రిటీగా కోహ్లి రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.
అందుకే విరాట్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు టాప్ కంపెనీలు సైతం ఆసక్తి చూపుతాయి. అతడిని అంబాసిడర్‌గా నియమించుకుని.. తమ ఉత్పత్తులకు ప్రచారం చేయించుకుంటాయి. తాజాగా ఓ ప్రముఖ బ్రాండ్ షూట్‌లో కనిపించాడు కోహ్లి.
ఇందులో భాగంగా తన గురించి గూగుల్‌లో ఎక్కువగా వెదుకుతున్న ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. మరి ఇందులో ప్రత్యేకత ఏమిటంటే... కోహ్లి హీలియం బెలూన్ చాలెంజ్ ట్రై చేశాడు. ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ముందు హీలియం పీల్చాలి. దీంతో గొంతు కాస్త మారుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ ప్రశ్నలు- సమాధానాలు ఏమిటంటే...
విరాట్ కోహ్లి ఏం చేస్తాడు?
►క్రికెట్ ఆడతా.
విరాట్ కోహ్లి కస్టమర్ కేర్ నంబర్?
►181818.. అయితే, మీరు కాల్ చేయరనే ఆశిస్తున్నా.
విరాట్ కోహ్లికి ప్రైవేట్ జెట్ ఉందా?
►లేదు. అదొక రూమర్ మాత్రమే. నాకు సొంత జెట్ లేదు.
విరాట్ కోహ్లి బ్లాక్ వాటర్ తాగుతాడా?
►అవును. అప్పుడప్పుడూ తాగుతాను. ఎక్కువగా ఆల్కలైన్ వాటర్ తాగుతాను.
విరాట్ కోహ్లి బాగా చదివేవాడా?
►నేను డీసెంటే. కానీ.. ఏ సబ్జెక్ట్‌లోనూ టాపర్ మాత్రం కాదు.
విరాట్ కోహ్లి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు?
►ప్యూమా షూట్‌లో ఉన్నాను.
మనీ హైస్ట్ సిరీస్‌లో విరాట్ కోహ్లి నటించాడా?
►లేదు. అయితే, అందులోని ప్రొఫెసర్ మాత్రం నాలాగే ఉంటాడు.
విరాట్ కోహ్లి పంజాబీ మాట్లాడగలడా?
►అవును. నేను పంజాబీ మాట్లాడగలను. పాటలు వింటాను.
కాగా కోహ్లి ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగించిన తర్వాత టెస్టు సారథిగా ఇదే తొలి సిరీస్ కావడం.. సఫారీ గడ్డపై ఇంతవరకు భారత్ టెస్టు సిరీస్ గెలిచిన దాఖలాలు లేకపోవడంతో ఎలాగైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. భారత కెప్టెన్లు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేసి తనను తాను నిరూపించుకోవాలని భావిస్తున్నాడు.
చదవండి: Vijay Hazare Trophy: షెల్డన్ అద్భుత క్యాచ్.. 23,1,1,1,18,14,1,0,5,0.. విదర్భ బ్యాటర్లందరూ చేతులెత్తేశారు.. ఒక్కడే 72!
Omicron- India Tour Of South Africa: టీమిండియా అప్పటికప్పుడు స్వదేశానికి బయల్దేరవచ్చు.. అనుమతులు తీసుకున్నాం!