Deepak Chahar: బ్రదర్.. ఇప్పుడు నువ్వు ఒక స్టార్

న్యూఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు దీపక్ చహర్ శ్రీలంకతో జరిగిన వన్డేలో (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతంగా ఆడాడు. చహల్ ఇన్నింగ్స్‌పై అతని సోదరి మాల్తీ చహర్ ట్విటర్ వేదికగా వినూత్న రీతిలో స్పందించింది. ''బ్రదర్ ఈ ఇన్నింగ్స్‌తో నువ్వు సాధించావు.. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో ప్రతీ భారత అభిమాని మనసులను గెలుచుకున్నావు. నువ్వు ఇలాగే ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటున్నా. కీప్ స్మైలింగ్ మై లవ్ లీ బ్రదర్'' అంటూ ట్వీట్ చేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చహల్ (3/50), భువనేశ్వర్ (3/54), దీపక్ చహర్ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే ఈనెల 23న జరుగుతుంది.
And you did it brother 😘
Won the match for India and heart of every Indian❤️ @deepak_chahar9
You are ⭐️.. keep shining😘#indiavssrilanka #teamindia #bleedblue pic.twitter.com/WpLVejJCWh— Malti Chahar🇮🇳 (@ChaharMalti) July 20, 2021
సంబంధిత వార్తలు