నామినేషన్ల స్వీకరణలో అశ్రద్ధ తగదు
సిద్దిపేటరూరల్: నామినేషన్లను టీ–పోల్‌లో అప్‌లోడ్ చేయాలని, ఏ మాత్రం అశ్రద్ధ చూపవద్దని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం నారాయణరావుపేట మండలం మల్యాల, రూరల్ మండలం పుల్లూరు, మచాపూర్ క్లస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 దాటినా మల్యాల, మాచాపూర్ క్లస్టర్‌లో ఎక్కువ మంది అభ్యర్థులు లైన్‌లో నిరీక్షించడాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ పత్రాలు స్వీకరించిన వెంటనే టీ–పోల్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు.
కలెక్టర్ హైమావతి
క్లస్టర్ల పరిశీలన


