
సాయుధ పోరాటయోధుడు కొమురయ్య
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ హైమావతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన కలెక్టర్.. కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, బీసీ అభివృద్ధి అధికారి నాగ రాజమ్మ, కురుమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆశయాలను సాధిస్తాం
కొమురవెల్లి(సిద్దిపేట): భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం పోరాడి అమరుడైన దొడ్డికొమురయ్య ఆశయాలను సాధిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కొమురయ్య వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ నిజాం సైన్యాలకు కొమురయ్య ఎదురొడ్డి ప్రజలను వెట్టిచాకిరి నుంచి కాపాడారని అన్నారు. కార్యక్రమంలో శెట్టిపల్లి సత్తిరెడ్డి, తాడూరి రవీందర్, కృష్ణారెడ్డి, అత్తిని శారద పాల్గొన్నారు.