
బీఎల్‌ఓల పాత్ర కీలకం
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
సిద్దిపేటరూరల్: ఓటరు జాబితా పొందుపరచడంలో బీఎల్‌ఓల పాత్ర ఎంతో కీలకమని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల బూత్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల వివరాలు జాగ్రత్తగా సేకరించి నమోదు చేయాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనీ అధికారులు చెప్పే అంశాలను అర్థం చేసుకోవాలని బీఎల్‌ఓలకు సూచించారు. కార్యక్రమంలో నారాయణరావుపేట తహసీల్దార్ మాధవి, మాస్టర్ ట్రైనీలు, మండలంలోని బీఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.