
పంచాయతీలకు..
శనివారం శ్రీ 5 శ్రీ జూలై శ్రీ 2025
జిమ్ చేయాలంటే..
వైకుంఠానికి రావాల్సిందే
● ఇష్టారాజ్యంగా జిమ్‌ల ఏర్పాటు ● అధికారుల విచిత్ర వైఖరి
మీరు జిమ్ చేయాలనుకుంటున్నారా?.. అయితే ‘వైకుంఠా’నికి రావాల్సిందే. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా?.. అవును.. ఇది నిజమే. హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామంలోని వైకుంఠధామం(శ్మశానం) లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. ఊరూరా ఓపెన్ జిమ్ ఏర్పాటులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే యువత శ్మశానానికి వెళ్లడానికి భయపడుతున్నారు. పొద్దున్నే లేచి సమాధుల మధ్య వ్యాయామం ఎలా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఎవరూ లేని ప్రదేశంలో, నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేయడంపై మండిపడుతున్నారు. అలాగే నాగారంలోనూ డంపింగ్ షెడ్డు దగ్గర జిమ్ నిర్మించడంపైనా ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. యువతకు అందుబాటులో ఉండేలా వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇలా ఎక్కడపడితే అక్కడ ఏర్పాటు చేయడం.. అవి కూడా నాసిరకం కావడంపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
– హుస్నాబాద్‌రూరల్
నాగారం గ్రామంలో
డంపింగ్ షెడ్డు దగ్గర
నిర్మించిన ఓపెన్ జిమ్
న్యూస్‌రీల్
కలెక్టర్ హైమావతి

పంచాయతీలకు..

పంచాయతీలకు..