
మోదీ కానుకగా సైకిళ్ల పంపిణీ
టెన్త్ విద్యార్థులకు అందజేయనున్న కేంద్ర మంత్రి బండి సంజయ్
హుస్నాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పుట్టిన రోజు (ఈ నెల 11) పురస్కరించుకుని మోదీ కానుకగా పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లల్లో చదివే విద్యార్థినీవిద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తారు. జిల్లాలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో 783, హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో ఒక్కో వార్డుకు 50 చొప్పున 20 వార్డులకు గాను వెయ్యి సైకిళ్లు అందజేయనున్నారు. సైకిల్ రాడ్‌కు ఒక వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇంకో వైపు బండి సంజయ్ ఫొటో ముద్రించనున్నారు. ఈ నెల 8 లేదా 9వ తేదీన పంపిణీ చేసేందుకు మంత్రి బండి సంజయ్ సిద్ధమయ్యారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకునే పిల్లలు పేద కుటుంబాల వారే ఎక్కువ. వీరికి రవాణా ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.