
ఆయిల్‌పామ్‌తో బోలెడు లాభాలు
జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ రోజాశర్మ
చిన్నకోడూరు(సిద్దిపేట): రైతులు ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ రోజాశర్మ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చంద్లాపూర్‌లో తన సొంత ఆయిల్ పామ్ తోటలో పామా యిల్ గింజలు కోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ తోటలు వందల ఎకరాల్లో సాగు చేస్తున్నారన్నారు. రైతులు వరికి బదులుగా ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రవి, అంజిరెడ్డి, వెంకట్‌రెడ్డి, లింగం, భాస్కర్, సాయిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
‘చేవెళ్ల డిక్లరేషన్’పై
ఖర్గే చొరవ చూపాలి
డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
దాసరి ఏగొండ స్వామి
గజ్వేల్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేసిన చేవేళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని డీబీఎఫ్(దళిత బహుజన ఫ్రంట్) రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం గజ్వేల్‌లో ఖర్గేకు బహిరంగ లేఖను విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఎస్సీ కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.12లక్షలను అందజేసేవిధంగా అంబేడ్కర్ అభయహస్తం పథకాన్ని అమలు చేస్తామని, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కార్పొరేషన్లను బలోపేతం చేసి ఏడాదికి రూ.750కోట్ల నిధులు అందజేస్తామని కూడా హామీ ఇచ్చారని చెప్పారు. హామీల అమలుకు ఖర్గే చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్, ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు బాగుచేయాలంటూ వినూత్న నిరసన
చేర్యాల(సిద్దిపేట): రోడ్డు బాగు చేయాలంటూ స్థానికులు వినూత్న నిరసన తెలిపారు. పట్టణ కేంద్రం నుంచి శివారు గట్టుతోటకు వెళ్లే దారి బురదమయంగా మారినా ఎవరూ పట్టించుకోకపోవడంతో శుక్రవారం రోడ్డుపై నాట్లు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది నుంచి రోడ్డు అధ్వానంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. చేసేదిలేక వరినాట్లు వేసినట్లు తెలిపారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు పట్టించుకుని రోడ్డు బాగు చేయాలని, లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామన్నారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు భిక్షపతి, స్థానికులు కామల్ల అనిల్, కామల్ల కమలాకర్, కందూరి కర్ణాకర్, కాకర్ల యాదయ్య, కందూరు మహేష్ పాక వెంకటేష్, సూర మహేష్, సూర్ల రాకేష్, కందూరి లింగం, సూర్ల రాజు, పాక కృష్ణ. సూర్ల లింగం. కందూరి శ్రీకాంత్, తుప్పతి రాములు పాల్గొన్నారు.
విద్యార్థులకు మెరుగైనవిద్య అందించాలి
జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి
దౌల్తాబాద్ (దుబ్బాక): విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తిర్మలాపూర్, అహ్మద్‌నగర్ పలు పాఠశాలలను ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. 15 ఏళ్ల యువకులకు, వయోజనులకు తెలంగాణ ఓపెన్ స్కూల్ ద్వారా విద్యను అభ్యసించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు ,ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, ముత్యం రెడ్డి, ప్రశాంత్, స్వాతి, సౌజన్య, సీఆర్పీలు పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్‌తో బోలెడు లాభాలు