
నీటి ఎత్తిపోతలను ప్రారంభించండి
గజ్వేల్: మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నీటి ఎత్తిపోతలను ప్రారంభించి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లను నింపాలని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఆయువుపట్టుగా ఉన్న కాళేశ్వరంను రైతులకు ఉపయోగపడేవిధంగా తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాళేశ్వరంపై విషప్రచారం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని ఎక్కడికక్కడా ఎండగడతామని హెచ్చరించారు. ఎత్తిపోతలను ప్రారంభించకపోతే రాజీవ్‌రహదారిని రైతుల ఆధ్వర్యంలో దిగ్భంధిస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, బీఆర్‌ఎస్ నాయ కులు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యలపైప్రత్యేక దృష్టి
గజ్వేల్: విద్యుత్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు గజ్వేల్ విద్యుత్ శాఖ డీఈ భానుప్రకాశ్ అన్నారు. గురు వారం కొడకండ్ల, బూర్గుపల్లి గ్రామాల్లో పర్య టించారు. ఈ సందర్భంగా రైతులతో మా ట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులు తమ ఇబ్బందులను తెలియజేయగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ సెక్షన్ ఏఈ సత్యం పాల్గొన్నారు.