
దాటేదెలా?
వాగులు
వానొస్తే.. రాస్తా బంద్
● లోలెవల్ వంతెనలతో ప్రజల అవస్థలు ● రోడ్లపై నిలుస్తున్న వరద ● రాకపోకలకు తప్పని అంతరాయం ● ఆందోళనలో సమీప గ్రామాల ప్రజలు
జిల్లాలోని పలు లోలెవల్ వంతెనలతో వానాకాలంలో రాకపోకలకు తిప్పలు తప్పడంలేదు. భారీ వర్షాలకు ప్రధాన రహదారులపై ఉన్న బ్రిడ్జిలపైకి పెద్దఎత్తున వరద ప్రవహిస్తుండటంతో స్థానికుల బాధలు అన్నీఇన్నీకావు. ప్రతీఏటా వరద ఉధృతికి చెరువులు, వాగులు పొంగిపొర్లి తక్కువ ఎత్తులో ఉన్న వంతెనలపై ప్రవహిస్తున్నాయి. వరద తీవ్రత తెలియక కొందరు అత్యవసర పరిస్థితులో దాటే ప్రయత్నంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వీటిపై హైలెవల్ వంతెనలు నిర్మిస్తే ఇబ్బందులు తొలుగుతాయని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట
మిరుదొడ్డి మండలం అల్వాల శివారు కూడవెల్లి వాగులో పిల్లర్ల దశలోనే నిలిచిన పనులు
కానరాని మోక్షం.. ప్రాణాలే పణం
మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని అల్వాల శివారు కూడవెల్లి వాగుపై ఉన్న హైలెవల్ వంతెన నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ రూ.4కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందుకోసం జూలై6, 2015న నిర్మాణానికి శంకుస్థాసన చేశారు. స్థల వివాదం కారణంగా పిల్లర్ల దశలోనే ఆగిపోయింది. దీంతో ఏళ్లు గడుస్తున్నా బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. ప్రస్తుతం ఉన్న లోలెవల్ బ్రిడ్జి పైనుంచి వరద పోటెత్తుతుండటంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడంలేదు. భారీ వర్షాలకు పలు మార్లు రాకపోకలు సైతం నిలిచిపోతున్నాయి. మూడేళ్ల క్రితం వాగు దాటుతున్న క్రమంలో ఓ వ్యక్తి వరద నీటిలో గల్లంతై మృతిచెందారు.

దాటేదెలా?

దాటేదెలా?