
తాత్కాలిక పనులతోనే సరి..
హుస్నాబాద్ రూరల్: భారీ వర్షం పడితే సిద్దిపేట నుంచి హుస్నాబాద్‌కు రాకపోకలు బంద్ అవుతుంటాయి. 365డీజీ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా హుస్నాబాద్‌కు సమీపంలో రేణుక ఎల్లమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాగులోనే తాత్కాలికంగా కొంత మట్టి పోసి దాని మీది నుంచే రాకపోకలు సాగుతున్నాయి. భారీ వర్షం పడితే సిద్దిపేట నుంచి హన్మకొండకు సైతం రాకపోకలు నిలిచిపోతుంటాయి. సిద్దిపేటకు రాకపోకలు సాగించాలంటే కొత్తపల్లి నుంచి రాజీవ్ రహదారి మీదుగా వెళ్లాల్సివస్తోంది. భారీ వర్షాలు కురవకముందే పనులు పూర్తి చేయాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.
రేణుక ఎల్లమ్మ వాగు