
నాచగిరికి పాలకమండలి నియామకం
వర్గల్(గజ్వేల్): నాచారం దేవస్థాన పాలక మండలి ఖరారైంది. ఈ మేరకు దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నాచగిరి ఆలయ కమిటీ ధర్మకర్తలుగా పల్లెర్ల రవీందర్, జగ్గయ్యగారి శేఖర్, దేశపతి ఉషశ్రీ, గాల కిష్టయ్య, పద్మ, జగ్గన్నగారి సురేందర్‌రెడ్డి, జేఎస్ తిరుమల్‌రావు, రుద్ర శ్రీహరి, కె. శ్రీనివాస్, చంద నాగరాజులతో కూడిన కమిటీని దేవాదాయశాఖ ఏర్పాటు చేసింది. చైర్మన్‌గా జగ్గయ్యగారి శేఖర్‌ను ఎన్నుకోనున్నట్లు, పాలకమండలి ప్రమాణస్వీకారం శుక్రవారం జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
తెలుగు వర్సిటీ ప్రతిభాపురస్కారానికి రమేశ్‌లాల్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారానికి ప్రముఖ పేరణీ నృత్యకారుడు రమేశ్‌లాల్ ఎంపిక అయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా కేంద్రంలో రమేశ్‌లాల్‌ను కవులు సన్మానించారు. ఈ సందర్భంగా ఐత చంద్రయ్య మాట్లాడుతూ పేరణీ విభాగంలో రమేశ్‌లాల్‌కు ప్రతిభా పురస్కారం రావడం సంతోషంగా ఉందన్నారు. కవులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కవులు ఎన్నవెళ్లి రాజమౌళి, ఉండ్రాళ్ళ రాజేశం, సింగీతం నరసింహారావు, కాల్వ రాజయ్య, నల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకుఅండగా ఉంటాం
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
జగదేవ్‌పూర్(గజ్వేల్): కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అన్నారు. జగదేవ్‌పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు చిరంజీవి సోదరుడు సంతోష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నర్సారెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్‌రెడ్డిలతో కలిసి మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రూ.24 వేల ఆర్థిక సహాయం అందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆపద సమయంలో అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, మండల నాయకులు ఉన్నారు.

నాచగిరికి పాలకమండలి నియామకం

నాచగిరికి పాలకమండలి నియామకం