
పాఠశాలల్లో ఎన్నో వసతులు
బెజ్జంకి(సిద్దిపేట): ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక వసతులను కల్పిస్తుందని విద్యాశాఖ మానిటరింగ్ అధికారి భాస్కర్ అన్నారు. మండలంలోని గుండారం ప్రాథమిక పాఠశాలలో ప్రి ప్రైమరీ తరగతులు, క్రీడా పరికరాలను ఎంఈఓ మహతిలక్ష్మితో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న రోజులలో పాఠశాలలకు కంప్యూటర్‌లను కూడా ఇవ్వనున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం తిరుపతి, కాంప్లెక్స్ హెచ్‌ఎం శ్రీరాములు, హైస్కూల్ హెచ్‌ఎం నాగవేణి, రవీందర్, శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, దేవయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ సేవతోనే
ప్రత్యేక గుర్తింపు
కోహెడ(హుస్నాబాద్): ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా, ఉత్తమ సేవలందిస్తే ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఏసీపీ సదానందం అన్నారు. మంగళవారం రాత్రి కోహెడ పీఎస్‌లో ఏఎస్‌ఐ ఎడ్ల పవన్‌కుమార్ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన హజరై మాట్లాడారు. పవన్‌కుమార్ 42 యేళ్లుగా అంకిత భావంతో సేవలందించడం హర్షణీయమన్నారు. ఏఎస్‌ఐ దంపతులను ఘనంగా సత్కరించి బహుమతిని అందించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ అభిలాష్, సీఐ శ్రీను, కోహెడ, హుస్నాబాద్, అక్కన్నపేట ఎస్‌ఐలు అభిలాష్, మహేశ్, విజయ్‌భాస్కర్, ఏఎస్‌ఐలు కనకయ్య, తిలక్ తదితరులు పాల్గొన్నారు.
మేలైన దిగుబడులు
దుబ్బాకటౌన్: రైతులు పంట సాగులో మెళకువలు పాటిస్తే మేలైన దిగుబడులు పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ సూచించారు. మంగళవారం స్థానిక రైతువేదికలో ఆహార భద్రత పథకంలో భాగంగా రైతులకు ఎల్‌ఆర్‌జీ 52 కంది విత్తనాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విత్తనాలు ఎండు తెగులును తట్టుకుంటాయని, అధిక దిగుబడులు పొందవచ్చని చెప్పారు. విత్తనాలను ఏక పంటగా లేదా పొలం గట్లపై వేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏఈఓలు సంతోష్, హరీశ్, సురేందర్ తదితరులున్నారు.
ఆయిల్‌పామ్‌తో లాభాలు
చిన్నకోడూరు(సిద్దిపేట): రైతులు ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయశాఖ అధికారి జయంత్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని అల్లీపూర్ తదితర గ్రామాల్లో ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ సంప్రదాయ నూనెగింజల కంటే 4 నుంచి 5 రెట్ల అధిక దిగుబడి ఉంటుందని, నాలుగు అంతర పంటలు సాగుచేసి మూడింతల ఆదాయం పొందవచ్చని సూచించారు. ఒక్కసారి సాగుచేస్తే 35 యేళ్ల వరకు దిగుబడి ఇస్తుందని, రైతులు వరికి బదులుగా ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
వైద్య వృత్తి గొప్పది
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వైద్య వృత్తి చాలా గొప్పదని, వారిని ప్రజలు దేవుళ్లతో సమానంగా భావిస్తారని టీపీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు. డాక్టర్స్ డేను పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని డాక్టర్‌లను, సిద్దిపేట కాంగ్రెస్ కౌన్సిలర్ రియాజొద్దిన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడటం కేవలం డాక్టర్‌లకు మాత్రమే సాధ్యమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు గుండు రవితేజ తదితరులు పాల్గొన్నారు.
సీఏం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు
కోహెడ(హుస్నాబాద్): ఉద్యమ కవి, గాయకుడు నేర్నాల కిషోర్‌ను రాష్ట్ర టూరిజం, భాషా సాంస్కృతికశాఖ సలహాదారుడిగా సీఏం రేవంత్‌రెడ్డి ప్రకటించటం హర్షణీయమ ని మండల కళాకారుల ప్రతినిధి పొన్నాల అశోక్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకశాలు కల్పించాలని కోరా రు. సీఎం, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కోదండరాంకు కృతజ్ఞతలు తెలిపారు.

పాఠశాలల్లో ఎన్నో వసతులు

పాఠశాలల్లో ఎన్నో వసతులు