
రెండు రోజుల్లో కాలేజీకి రోడ్డు
హుస్నాబాద్‌రూరల్: పాలిటెక్నిక్ కాలేజీ రోడ్డును రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ‘కాలేజీకి రోడ్డు నిర్మించరూ..?’ అనే శీర్షికన సోమవారం సాక్షిలో వచ్చిన కథనానికి కలెక్టర్ స్పందించి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను పనుల వివరాల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి రోడ్డు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో డీఈ మహేశ్ ఆధ్వర్యంలో మంగళవారం పనులు ప్రారంభించారు.
దరఖాస్తుల ఆహ్వానం
గజ్వేల్‌రూరల్: మోడల్‌స్కూల్‌లో విద్యార్థులకు హిందీ బోధించేందుకు గెస్ట్ టీచర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వన్నెస మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గంటల ప్రాతిపదికన బోధించేందుకు ఆసక్తికల అభ్యర్థులను గురువారం పాఠశాలలో డెమో, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారని తెలిపారు.
ఉపాధ్యాయుల కృషి వల్లే..
కొండపాక(గజ్వేల్): ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కృషివల్లే విద్యార్థుల సంఖ్య పెరిగిందని మండల విద్యాధికారి బచ్చలి సత్తయ్య అన్నారు. కుకునూరుపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు చేరడంపై హెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులను మంగళవారం ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు డిక్షనరీలు అందజేశారు. కార్యక్రమంలో సీఆర్పీ సంతోష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రెండు రోజుల్లో కాలేజీకి రోడ్డు