
పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్
సిద్దిపేటజోన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ పరిశీలించారు. స్థానిక 43వ వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు లక్ష్మి స్థలాన్ని మంగళవారం ఆమె పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఆమె వెంట మున్సిపల్ డీఈ ప్రేరణ, హౌసింగ్ అధికారి దివ్య, మున్సిపల్ అధికారి శ్రీనాథ్, వార్డు కౌన్సిలర్ పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.
ఇళ్లు రానివారు ఆందోళన చెందొద్దు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): లిస్టులో పేరు రానివారు ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్‌లు అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో ఇందిరమ్మ ఇళ్లకు మంగళవారం వారు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉండగా డబుల్ బెడ్రూంలు రూం ఇస్తామని చెప్పి కాలయాపన చేశారన్నారు. నాయకుల సంక్షేమం తప్ప ప్రజల సంక్షేమం పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలలో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం పెరిగిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కష్టపడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో బొమ్మల యాదగిరి, ముద్దం లక్ష్మి, రియాజొద్దిన్, కలీమొద్దిన్, పయ్యావు ఎల్లం యాదవ్, మధు, నజ్జు, హర్షద్, వహాబ్, రజిని, సంతోష, సాయి, ప్రతాప్, రాకేశ్, రాజు, షాబొద్దిన్, మెరుగు రాజు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇళ్లు
దుబ్బాకటౌన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బురాణి శ్రీకాంత్ అన్నారు. ధర్మాజీపేట వార్డులో ఇందిరమ్మ ఇంటి నిర్మాణకి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఈ జాహ్నవి, వార్డు అధికారులు రమేశ్, మాజీ కౌన్సిలర్ స్వామి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్