
శక్తివంచన లేకుండా కృషి చేస్తా..
ములుగు(గజ్వేల్): ఉపాధ్యాయుల సమస్యలపై శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి చెప్పారు. ములుగు మండలం తున్కిబొల్లారం ఆర్‌అండ్‌ఆర్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నిర్వహించిన హెచ్‌ఎం బి.రంగారావు ఉద్యోగ విరమణ అభినందన సభకు ఆయన ముఖ్యతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా అన్ని కార్పొరేట్ ఆస్పపత్రులలో వర్తింప జేసే విధంగా ఉపాధ్యాయులకు త్వరలోనే హెల్త్ కార్డులు అందజేయనున్నామన్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇప్పిస్తామని, అందులో ఎస్‌జీటీ ఉపాధ్యాయులు లాభపడే విధంగా కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వంగ మహేందర్‌రెడ్డి, ఎంఈఓలు ఉదయ్‌బాస్కర్‌రెడ్డి, మాధవరెడ్డి, పీఆర్‌టీయూ నేతలు ఇంద్రసేనారెడ్డి, శశిధర్‌శర్మ, రాధిక, శ్రీనివాస్‌రెడ్డి, జ్యోతి, వీణమ్మ, రామనర్సయ్య, శ్రీనివాస్, మనోహర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, బాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి