
వైద్యులు ప్రజల ప్రాణాలు రక్షించే దేవుళ్లు
చేర్యాల(సిద్దిపేట): వైద్యులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షించే దేవుళ్లని సీఐ ఎల్.శ్రీను ప్రశంసించారు. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం చేర్యాల డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. యశోద ఆస్పత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత వైద్య ప్రారంభించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. వైద్యులు తమ వ్యాపారం కోసమే కాకుండా ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నీరేష్, పీఎస్‌ఐ సమత, ఎంఈఓ కిష్టయ్య, వైద్యులు శ్రీకాంత్, పరమేశ్వర్, సంతోష్‌కుమార్, రఘునందన్, సతీశ్, బాలకిషన్, శ్రీకాంత్, నాయకులు ఆగంరెడ్డి, కళావతి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
సీఐ శ్రీను