
పెండింగ్ కేసులపై సత్వర నిర్ణయం
సిద్దిపేటకమాన్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులలో పోలీసు శాఖ తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. సిద్దిపేట జిల్లా కోర్టులో కలెక్టర్ హైమావతి, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలతో శనివారం ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టులలో పెండింగ్ కేసులలో పోలీసు శాఖ తరపున తీసుకోవాల్సిన చర్యల గురించి తగు ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక కోర్టు భవనాల స్థల సేకరణపై జిల్లా కలెక్టర్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో అడిషనల్ జిల్లా సీనియర్ జడ్జి జయప్రసాద్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఏసీపీలు రవీందర్‌రెడ్డి, సీఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, శ్రీను, సైదా, ఎస్‌ఐ రాజేష్ పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి