
పెండింగ్ కేసులు పరిష్కరించండి
సిద్దిపేటకమాన్: పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు జిల్లా కోర్టులో న్యాయమూర్తులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పాత కేసులన్నీ పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, వినోద్‌కాంబ్లే, సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పాలిసెట్
కౌన్సెలింగ్ ప్రారంభం
నంగునూరు(సిద్దిపేట):పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ గురువారం ప్రారంభమైంది. రాజగోపాల్‌పేటలో నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు మొదటి రోజు 289 మంది విద్యార్థులు హాజరయ్యారు. సర్టిఫికెట్లు పరిశీలించిన అధికారులు ఐడీ పాస్‌వర్డు అందజేశారు. ప్రిన్సిపాల్ గోవర్ధన్ మాట్లాడుతూ ఐడీ పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు పెట్టు కోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫొటో ముద్రించాలి
ప్రధానికి లక్ష పోస్ట్ కార్డుల ఉద్యమం
చేర్యాల(సిద్దిపేట): ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని సాధన సమితి జాతీయ అధ్యక్షుడు పరశురాం డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ప్రధానికి లక్ష పోస్ట్ కార్డ్‌ల ఉద్యమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 23న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైన కార్యక్రమం గురువారం పట్టణ కేంద్రానికి చేరుకుంది. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత బహుజన సంఘాల నాయకులు స్వాగతం పలికారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ప్రధాని మోదీకి పోస్ట్ కార్డులు రాశారు. ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ అంబేడ్కర్ సూచనలతోనే 1935 ఏప్రిల్ 1 రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఏర్పాటైందన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 500 మందితో పోస్ట్ కార్డ్స్ వేయించామన్నారు. 26 జనవరి 2026 వరకు ప్రధానికి లక్ష మందితో పోస్ట్‌కార్డ్‌లు వేయిస్తామన్నారు. కార్యక్రమంలో కరెన్సీపై అంబేడ్కర్ ఫొటో సాధన సమితి జిల్లా కన్వీనర్ మేడిపల్లి చందు, మాజీ కౌన్సిలర్ చంటి, మాజీ సర్పంచ్ వల్లూరి శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు.
ఎరువులు అధిక ధరలకు
విక్రయిస్తే చర్యలు
చిన్నకోడూరు(సిద్దిపేట): ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయించే డీలర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని చిన్నకోడూరు, గంగాపూర్, రామంచ గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించవద్దన్నారు. ఈ పాస్ యంత్రాల ద్వారానే ఎరువులు అమ్మాలని ఆదేశించారు. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు. యూరియాను అవసరం మేరకు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ జయంత్ కుమార్, ఏఈఓలు పాల్గొన్నారు.

పెండింగ్ కేసులు పరిష్కరించండి

పెండింగ్ కేసులు పరిష్కరించండి

పెండింగ్ కేసులు పరిష్కరించండి