
కురిసిన వాన.. మురిసిన రైతన్న
వానాకాలం సీజన్‌లో సాగు వివరాలు (ఎకరాల్లో)
పంట ఇప్పటి వరకు
సాగైన పంటలు
వరి 614
మొక్కజొన్న 9,145
పత్తి 51,510
కందులు 553
పెసర్లు 36
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కురిసిన వర్షాలతో సాగు పనులు ముమ్మరమయ్యాయి. కొద్ది రోజులుగా వర్షాలు లేక మొలకెత్తిన మొలకలు సైతం వాడిపోతుండటంతో దిగులుచెందుతున్న రైతుల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు కురిసిన వర్షాలు సంతోషాలను నింపాయి. జిల్లా వ్యాప్తంగా 1081.6మిల్లిమీటర్లు, సగటున 41.6మిల్లిమీటర్ల వర్ష పాతం నమోదయ్యింది. అత్యధికంగా నారాయణరావు పేట మండలంలో 90.21మి.మీ, సిద్దిపేట రూరల్ మండలంలో 73.2మి.మీ, సిద్దిపేట అర్బన్ మండలంలో 69.6మి.మీ, కోహెడ మండలంలో 56.3మి.మీ, అక్బర్‌పేట భూంపల్లి మండలంలో 55.8మి.మీ, తొగుట మండలంలో 55.5మి.మీ, దుబ్బాక మండలంలో 53.2మి.మీ, దౌల్తాబాద్ మండలంలో 52.9మి.మీ, అక్కన్నపేట మండలంలో 52.1మి.మీ, చిన్నకోడూరు, బెజ్జంకి మండలాలలో 51.1 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఎండిపోయే దశలో ఉన్న పంటలకు వానలు ఊపిరిపోశాయి. ముందుగానే పంటలపై ప్రణాళిక సిద్ధం చేసుకున్నౖ రెతులకు ఈ వర్షంతో కోండంత ధైర్యాన్ని ఇచ్చాయి. రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వ్యవసాయాదారులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు.
జిల్లా వ్యాప్తంగా 1081.6 మిల్లీమీటర్ల వర్షపాతం
నారాయణరావుపేటలో అత్యధికం
పంటలకు జీవం పోసిన వరుణుడు
సాగు పనుల్లో అన్నదాతలు బిజీ
పంటకు ప్రాణం
నాకున్న భూమిని సాగుకు సిద్ధం చేసి, ప్రారంభంలో వర్షం పడగానే విత్తనాలు వేశాను. ఆ తరువాత వానలు లేకపోవడంతో బాధపడ్డాను. కొద్ది రోజులగా వానలు కురవడంతో పంటలకు ప్రాణం పోసినట్లయింది.
– అనిమెల అభి, రైతు, తొగుట

కురిసిన వాన.. మురిసిన రైతన్న