
ఆయిల్‌పాం రైతులపై వివక్ష
నంగునూరు(సిద్దిపేట): ఆయిల్‌పాం సాగుచేస్తున్న రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్మేటలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు లాభదాయక పంటలు సాగు చేయాలనే లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 300 కోట్లతో ఆసియాలోనే అత్యాధునిక టెక్నాలజీతో అయిల్‌పామ్ ఫ్యాక్టరీకి అంకురార్పణ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించకపోవడంతో రైతులు పంట సాగుకు మొగ్గు చూపడంలేదన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పంటపై తగ్గించిన సుంకాన్ని యథాస్థానానికి తేవాలని డిమాండ్ చేశారు.
మనదంతా ఒకే కుటుంబం
సిద్దిపేటజోన్: నియోజకవర్గ ప్రజలంతా నా కుటుంబమని, మీ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 227మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందినట్లు పేర్కొన్నారు. అనంతరం నంగనూర్ మండలం మల్యాల గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించారు.
ఎమ్మెల్యే హరీశ్‌రావు
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై మండిపాటు