సిద్దిపేటరూరల్: ఉపకరణాలు అవసరం ఉన్న దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీకాంత్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని రకాల ధ్రువపత్రాలతో http://tgobmms.cgg.gov.in// వెబ్‌సైట్‌లో ఈనెల 27లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్‌లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
27న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
సిద్దిపేటజోన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27న ఎంపిక పోటీలు ఉంటాయని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శి వెంకట్ స్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు స్థానిక స్టేడియంలో అండర్ 10, 12, 14 బాల బాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. పోటీల్లో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు, మొదటి మూడు స్థానాలు సాధించిన వారికి పతకాలు, మెరిట్ సర్టిఫికెట్స్ అందజేస్తారన్నారు. అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు వచ్చే నెల 6న హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 26న సాయంత్రం ఆరు గంటల లోపు బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్‌తో వచ్చి జిల్లా అథ్లెటిక్స్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8501977079, 9704061543 నంబర్లు సంప్రదించాలన్నారు.
రూ.1000 జరిమానా
అక్కన్నపేట(హుస్నాబాద్): ‘పచ్చని చెట్లపై గొడ్డలివేటు’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని పంచాయ తీ కార్యదర్శి స్వరూప స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం గ్రామస్తులు, మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను నేటమట్టం చేసిన రైతుకు రూ.1,000జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే రోడ్లకు ఇరువైపులా నాటిన చెట్లను ఎవరైనా నరికివేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
హక్కుల పరిరక్షణ కమిషన్ అధ్యక్షుడిగా రాజుచారి
సిద్దిపేటఅర్బన్: జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని ఎల్లుపల్లికి చెందిన చెన్నోజి రాజుచారి నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షురాడు విజయలక్ష్మి సోమవారం నియామక పత్రం అందజేశారు. తనను నమ్మి జిల్లా అధ్యక్షుడిగా రెండో సారి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షురాలికి రాజుచారి కృతజ్ఞతలు తెలిపారు.
టాస్క్‌ఫోర్స్ నూతన ఇన్‌స్పెక్టర్‌గా శ్రీధర్
సిద్దిపేటకమాన్: సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ నూతన ఇన్‌స్పెక్టర్‌గా శ్రీధర్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు నూతన సీఐ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ అనురాధను సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పీడీఎస్ రైస్, ఇసుక అక్రమ రవాణ జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
అందుబాటులో ఇంజనీరింగ్ విద్య
హుస్నాబాద్: శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల హుస్నాబాద్‌లో నూతన విద్యార్థుల అడ్మిషన్లు, తరగతులు ప్రారంభించేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో నాలుగు కోర్సులు ప్రభుత్వం కేటాయించింది. నాలుగు కోర్సులకు గాను 240 సీట్లతో అడ్మిషన్ల ప్రారంభం అవుతుందని మంత్రి పొన్నం తెలిపారు.
మంత్రి టెలికాన్ఫరెన్స్
హుస్నాబాద్: నియోజకవర్గంలోని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్లు ఏడీఏ శ్రీనివాస్ తెలిపారు. వానాకాలం సీజన్‌లో సాగు చేస్తున్న రైతులందరికీ రైతు భరోసా వేశామన్నారు. మిగిలి ఉన్న వారికి రేపటికల్లా రైతుల అకౌంట్లల్లో జమ అవుతాయని తెలిపారు.