
ఉత్సాహంగా ఒలింపిక్ రన్
సిద్దిపేటజోన్: ఒలింపిక్ డే పురస్కరించుకుని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఒలింపిక్ రన్ నిర్వహించారు. స్థానిక ముస్తాబాద్ చౌరస్తాలో జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య, జిల్లా క్రీడా సమాఖ్య చైర్మన్ సాయిరాంలు రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ముస్తాబాద్ చౌరస్తా నుంచి విక్టరీ టాకీస్ చౌరస్తా వరకు అక్కడి నుంచి తిరిగి డిగ్రీ కళాశాల మైదానం వరకు రన్ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు వెంకట్‌స్వామి, రవీందర్ రెడ్డి, ఉప్పలయ్య, రామేశ్వర్ రెడ్డి, అశోక్, యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.