
విద్య ద్వారానే విజ్ఞానం
కొండపాక(గజ్వేల్): విద్య ద్వారానే విజ్ఞానం పెంపొందుతుందని రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. బందారం గ్రామంలోని హైస్కూల్లో ‘మనం.. మన ఊరు’ పేరిట సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిధారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను ఓపికతో వింటూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. చిన్న తనం నుంచే లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగుతూ పుట్టిన ఊరుకు పెంచిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎక్కలదేవి పావని, రాగుల అర్చన, కెమ్మసారం అలేఖ్యలకు సిల్వర్ మెడల్స్‌తో పాటు నగదుగా అందజేస్తూ మిగతా విద్యార్థులకు విద్యాభ్యాస డైరీలను అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రాంచంద్రం, మనం మన ఊరు ఉద్యోగుల అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.