భూ నిర్వాసితులకు ఇళ్లు మంజూరు చేయండి | - | Sakshi
Sakshi News home page

భూ నిర్వాసితులకు ఇళ్లు మంజూరు చేయండి

May 13 2025 8:00 AM | Updated on May 13 2025 8:00 AM

భూ నిర్వాసితులకు ఇళ్లు మంజూరు చేయండి

భూ నిర్వాసితులకు ఇళ్లు మంజూరు చేయండి

మంత్రి ఉత్తమ్‌కు చాడ వినతి

హుస్నాబాద్‌: గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. గౌరవెల్లి ప్రాజెక్టులో 931 కుటుంబాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఇళ్లు, వ్యవసాయ భూములు సర్వం కోల్పోయారని, ఉండటానికి ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అక్కన్నపేట మండలం, గుడాటిపల్లి గ్రామస్తులు పెట్టుకున్న అర్జీని సత్వరమే పరిష్కరించాలని ఆయన కోరారు.

ఆరోగ్యవంతమైన

సమాజమే లక్ష్యం కావాలి

ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి

గజ్వేల్‌రూరల్‌: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కోమటిబండ సమీపంలోగల పాండవకృష్ణ ధ్యానక్షేత్రంలో గజ్వేల్‌ పిరమిడ్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బుద్ధ పౌర్ణమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటామన్నారు. బుద్దుడు సూచించిన అష్టాంగ మార్గాల ద్వారా మానవాళికి ఆధ్యాత్మిక జ్ఞానం లభించిందని, సంపూర్ణ ఆరోగ్య జీవితానికి యోగాసనాలు, ధాన్యం దివ్యౌషధంలా పనిచేస్తాయన్నారు. ఈ సందర్భంగా ధ్యాన క్షేత్రం ఆవరణలోని బుద్దుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు నర్సింహులు, బాల్‌రెడ్డి, రాజిరెడ్డి, ప్రభాకర్‌, సభ్యులు వేణు, ప్రశాంత్‌, హరి, బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళా సంఘాల

డబ్బులు స్వాహా చేస్తుండ్రు

సీఏల చేతివాటంపై కలెక్టర్‌కు

మహిళల ఫిర్యాదు

బెజ్జంకి(సిద్దిపేట): మహిళా సంఘాల సభ్యులకు రావాల్సిన రుణాల్లో సీఏలు చేతివాటం ప్రదర్శిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని మహిళలు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం బేగంపేటలోని వర్ధిని గ్రూపు సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బెజ్జంకి, బేగంపేటలతో పాటు పలు గ్రామాలలో మహిళా సంఘాల సభ్యులకు తెలియకుండానే లక్షలాది రూపాయల రుణాలు సంఘం బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయించిన అనంతరం సీఏలు తమ సొంత ఖాతాల్లోకి మార్చుకుంటూ ఆర్థిక నష్టాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సభ్యులు చెల్లించిన నెలసరి వాయిదా కిస్తీల డబ్బులను సైతం అకౌంట్‌లలో వేయకుండా సొంతానికి వాడుకుంటున్నారని తెలిపారు. ఇటీవల బేగంపేటకు చెందిన బాధిత సంఘం సభ్యులు మండల ఐకేపీ కార్యాలయంకు వెళ్లి ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదని వాపోయారు. మండల అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి మహిళా సంఘాల సభ్యులకు న్యాయం చేయాలని వారు కలెక్టర్‌ను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement