పోస్టాఫీస్‌లో ‘ఆధార్‌’ సేవలు | - | Sakshi
Sakshi News home page

పోస్టాఫీస్‌లో ‘ఆధార్‌’ సేవలు

May 10 2025 2:11 PM | Updated on May 10 2025 2:11 PM

పోస్ట

పోస్టాఫీస్‌లో ‘ఆధార్‌’ సేవలు

గజ్వేల్‌రూరల్‌: పోస్టాఫీస్‌లో ఆధార్‌ సేవలను అందిస్తున్నామని మెదక్‌ డివిజన్‌ పోస్టల్‌ ఎస్పీ శ్రీహరి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గజ్వేల్‌ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌(ఐఓసీ) ఆవరణలోని సబ్‌ పోస్టాఫీస్‌లో ఆధార్‌ సేవలు ప్రారంభించామన్నారు. కొత్తగా ఆధార్‌కార్డు నమోదు, మార్పులు, చేర్పులు, ఫొటో ఐడెంటిటీ, బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కౌంటర్‌ ద్వారా ఆధార్‌ సేవలను సులభంగా పొందవచ్చన్నారు. మున్సిపాలిటీతో పాటు సమీప గ్రామాల ప్రజలు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వైభవంగా రథోత్సవం

దుబ్బాక: పట్టణంలో శుక్రవారం కాశీవిశ్వనాథ స్వామి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే మొదలైన స్వామివారి రథోత్సవం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కనులపండువగా జరిగింది. భక్తులు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. హనుమాన్‌ మాలధారులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవం, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

12 నుంచి స్లాట్‌

బుకింగ్‌తో రిజిస్ట్రేషన్లు

సిద్దిపేటకమాన్‌: రిజిస్ట్రేషన్‌, స్టాంపుల కార్యాలయాల్లో 12వ తేదీ నుంచి స్లాట్‌ బుకింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ జరగనున్నట్లు అర్బన్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ గంట శ్రీలత, రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ మహేశ్‌ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ.. అర్బన్‌, రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలోని ఆస్తులను స్లాట్‌ బుకింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్నారు. ఒక రోజులో 48 స్లాట్‌ బుకింగ్స్‌ అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఇకపై స్లాట్‌ బుకింగ్‌ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్‌లు జరుగుతాయని తెలిపారు.

మంచి నడవడిక నేర్పించండి

నారాయణఖేడ్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు మంచి నడవడిక నేర్పించాలని ఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అంగన్‌వాడీ టీచర్లకు సూచించారు. ప్రభుత్వం మినీఅంగన్‌వాడీ టీచర్లను ప్రధాన అంగన్‌వాడీ టీచర్లుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ వేతనాన్ని రూ.7,800 నుంచి రూ.13,650లకు పెంచిన నేపథ్యంలో శుక్రవారం క్యాంపు కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు. అనంతరం సంజీవరెడ్డి మాట్లాడుతూ... పిల్లల భవిష్యత్తుకు కేంద్రాలు దోహదపడాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కొత్త విద్యాసంవత్సరం నుంచి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను నిర్వహించనున్నందున టీచర్లు పిల్లలపై ప్రత్యేక దృష్టిపెట్టి బంగారు బాటలు వేయాలన్నారు.

పోస్టాఫీస్‌లో ‘ఆధార్‌’ సేవలు1
1/1

పోస్టాఫీస్‌లో ‘ఆధార్‌’ సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement