
నకిలీ విత్తనాల విక్రయాలపై నిఘా
సీపీ అనురాధ
సిద్దిపేటకమాన్: నకిలీ విత్తనాల రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని సీపీ అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయశాఖ, టాస్క్‌ఫోర్స్, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందితో కలిసి పోలీసు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నకిలీ విత్తనాలతో రైతులను మోసం చేయాలని చూస్తే సహించబోమని తెలిపారు. అక్రమార్కులపై పీడీ యాక్టు అమలు చేస్తామన్నారు. అనుమానం వచ్చిన విత్తనాల శాంపిల్స్ వెంటనే పరీక్షించాలని తెలిపారు. నకిలీ విత్తనాలపై ఏదైనా సమాచారం ఉంటే డయల్ 100 లేదా పోలీసు కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712667100కు సమాచారం అందించాలని తెలిపారు.
నాచగిరిలో ఉత్సవాలకు
అంకురార్పణ
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన నాచగిరి క్షేత్రంలో గురువారం రాత్రి స్వామివారి జయంత్యుత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ముఖ్యఅర్చకులు జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు స్వామివారి సన్నిధిలో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యహవాచనం, రక్షాబంధనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
పగిలిన భగీరథ పైపు లైన్
మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గురువారం మిషన్ భగీరథ పైపు లైన్ పగిలిపోయింది. గంటల తరబడి నీరు ఎగసిపడ్డా యి. నీరంతా వృథాగా పోయింది. అధికారుల కు స్థానికులు సమాచారం అందించడంతో నీటి సరఫరాను నిలిపి వేశారు. అనంతరం అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టారు.
రైతులకు రూ.9కోట్ల రుణాలు
సిద్దిపేటకమాన్: వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి రైతులకు రూ.9కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిబాబు తెలిపారు. సిద్దిపేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో రైతులతో గురువారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్‌డీఎం హరిబాబు, రీజినల్ హెడ్ శ్రీనివాస్, వ్యవసాయశాఖ అధికారి రాధిక, డీడీఎం నిఖిల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్‌డీఎం మాట్లాడుతూ వ్యవసాయ పథకాలు, నాబార్డ్ సబ్సిడీ వివరాల గురించి అవగహన కల్పించినట్లు తెలిపారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించడం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. కార్యక్రమంలో సెరికల్చర్ అధికారి ఇంద్రసేనారెడ్డి, బ్రాంచ్ మేనేజర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ
పనులు నిలిపివేయండి
జిల్లా కోర్టు తాత్కాలిక స్టే ఉత్తర్వులు
బెజ్జంకి(సిద్దిపేట): గుగ్గిల్ల శివారులో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను నిలిపివేయాలని జిల్లా జడ్జి సాయి రమాదేవి తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్లు గ్రామ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వలన భూగర్భజలాలు అడుగంటడమే కాకుండా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని ఆందోళనలు చేశామన్నారు. జనావాసాలు లేని ప్రాంతాల్లో చేపట్టవలిసిన ఫ్యాక్టరీలు గ్రామాల మధ్య నిర్మించడాన్ని తప్పుబట్టారు. 2023లో జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. జూన్ 10వ తేదీ వరకు నిర్మాణం పనులు, ఉత్పత్తులు నిలిపేయాలని తాత్కాలిక స్టే ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో ఆగయ్య, రంజిత్, నరేందర్, శంకర్‌బాబు, ధర్మారెడ్డి, సురేష్, కిరణ్ పాల్గొన్నారు.

నకిలీ విత్తనాల విక్రయాలపై నిఘా

నకిలీ విత్తనాల విక్రయాలపై నిఘా

నకిలీ విత్తనాల విక్రయాలపై నిఘా