విద్యార్థులకు ఏఐ బోధన | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఏఐ బోధన

Apr 18 2025 5:36 AM | Updated on Apr 18 2025 7:41 AM

విద్య

విద్యార్థులకు ఏఐ బోధన

మిరుదొడ్డి (దుబ్బాక): విద్యలో వెనుకబడిన విద్యార్థుల స్థాయి పెంపునకు ఏఐ ఆధారిత ఎఫ్‌ఎల్‌ఎన్‌ బోధన దోహద పడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని కొండాపూర్‌ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కంప్యూటర్‌ ల్యాబ్‌ను పరిశీలించి, విద్యార్థులతో తెలుగు, ఇంగ్లిష్‌, గణితంపై అసెస్మెంటన్లు ప్రాక్టీస్‌ చేయించారు. అనంతరం పాఠశాల రికార్డులు, మధ్యాహ్న భోజనంతోపాటు ఆవరణలో నాటిన మొక్కలను పరిశీలించారు. అలాగే లింగుపల్లి ప్రాథమిక పాఠశాల, చెప్యాల ఉన్నత పాఠశాలను సందర్శించి డైట్‌ విద్యార్థుల ద్వారా థర్డ్‌ పార్టీ ఫిజికల్‌ వెరిఫికేషన్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రవీణ్‌ బాబు, ప్రధానోపాధ్యాయుడు బుచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు బాలకిషన్‌ , శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

దళారులను ఆశ్రయించొద్దు

బెజ్జంకి(సిద్దిపేట): వరి ధాన్యం విక్రయాల కోసం దళారులను ఆశ్రయించవద్దని డీఆర్‌డీఓ జయదేవ్‌ ఆర్య రైతులకు సూచించారు. బెజ్జంకి ఏఎంసీ మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రాలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తేమ, తాలు లేకుండా ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. వడ్లను తూర్పార బట్టే మిషన్‌ను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల కోసం కుడుతున్న యూనిఫామ్‌లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్‌, ఏపీఎం నర్సయ్య, సీసీలు సారయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీనర్సింహ స్వామి ఆదాయం 4.80 లక్షలు

బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి శ్రీలక్ష్మీనర్సింహ స్వామి బ్రహ్మోత్సవాల హుండీ ఆదాయం రూ.4 లక్షల 80 వేల 276 వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ జెల్ల ప్రభాకర్‌ తెలిపారు. ఎండోమెంట్‌ పరిశీలకురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం హుండీ తెరిచారు. మార్చి 23 తేదీ నుంచి నేటి వరకు హుండీలో వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. హుండీ ఆదాయంతో కలుపుకొని మొత్తం జాతర ఆదాయం రూ.14 లక్షల 9వేల 990 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ శర్మ, పూజారి మధుసూదనాచారి, ఏఎస్‌ఐ శంకర్‌రావు, డైరెక్టర్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ డయాలసిస్‌ సెంటర్‌కు బెస్ట్‌ పర్ఫామెన్స్‌ అవార్డు

దుబ్బాక: ఉత్తమ సేవలు అందించినందుకు గాను దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రి డయాలసిస్‌ సెంటర్‌కు బెస్ట్‌ పర్ఫామెన్స్‌ అవార్డు లభించింది. అపెక్స్‌ కిడ్నీ వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ముంబై దుబ్బాక కిడ్నీ సెంటర్‌కు అవార్డును అందించింది. 2023 మార్చ్‌ 5న దుబ్బాక ప్రభుత్వాస్పత్రిలో ఐదు బెడ్స్‌తో డయాలసిస్‌ సెంటర్‌ ప్రారంభమైంది. దీంతో ఇప్పటివరకు ఈ సెంటర్లో 8200 డయాలసిస్‌ కేసులతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోనే ఉత్తమ అవార్డు రావడం పట్ల ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హేమరాజ్‌ సింగ్‌, డయాలసిస్‌ ఇన్‌చార్జ్‌ శేఖర్‌, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

విద్యార్థులకు ఏఐ బోధన                    1
1/3

విద్యార్థులకు ఏఐ బోధన

విద్యార్థులకు ఏఐ బోధన                    2
2/3

విద్యార్థులకు ఏఐ బోధన

విద్యార్థులకు ఏఐ బోధన                    3
3/3

విద్యార్థులకు ఏఐ బోధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement