భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయండి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయండి

Mar 13 2025 2:36 PM | Updated on Mar 13 2025 2:36 PM

భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయండి

భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయండి

● కలెక్టర్‌ మిక్కిలినేని మనుచౌదరి ● టీజీఐఐసీ, రెవెన్యూ, సర్వేఅధికారులతో సమావేశం

సిద్దిపేటరూరల్‌: ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వారికి కేటాయించిన భూముల సేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌తో కలిసి టీజీఐఐసీ, రెవెన్యూ, సర్వే అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండలాల వారీగా కేటాయించిన ప్రభుత్వ, పట్టా, అసైన్డ్‌ భూములు వెరిఫై చేయాలన్నారు. భూసేకరణకు సంబంధించి ఎస్టిమేట్‌ చేసి టీజీఐఐసీ అధికారులకు పత్రాలు అందించాలన్నారు. డ్రోన్‌ద్వారా భూసేకరణ కొలతలు తీసుకుంటే సులభంగా వేగంగా జరుగుతుందని, ఈ పనిని ఎప్పటికప్పుడు ఆర్డీఓలు పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీఓలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి, టీజీఐఐసీ జోనల్‌మేనేజర్‌ అనురాధ, డీజీఎం ఉమామహేశ్వర్‌, డీఈ జ్యోతి, సర్వేల్యాండ్‌ ఏడీ వినయ్‌కుమార్‌, ఏఓ రెహమన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ

సద్వినియోగం చేసుకోండి

సిద్దిపేటరూరల్‌: ఎల్‌అర్‌ఎస్‌ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ మనుచౌదరి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ లోని మీటింగ్‌ హాల్‌ లో అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, తహసీల్దార్‌, ఎంపీఓ, ఎంపీడీఓ, లేఅవుట్‌ యజమానులతో అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ తో కలిసి కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాటు యజమానులు ఈనెలాఖరులోపు 25 శాతం రాయితీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే పరిష్కరించుకోవాలని తెలిపారు.

ఈనెలాఖరులో పనులు పూర్తి చేయాలి

సిద్దిపేటరూరల్‌: ఉపాధి హమీలో భాగంగా చేపట్టిన సీసీరోడ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల్లో మరుగుదొడ్లు, డ్రైనేజీలు, గ్రామపంచాయతీ భవనాలు తదితర నిర్మాణ పనులను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పూర్తయిన నిర్మాణాలకు సంబంధించి ఎంబీ రికార్డ్‌ చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement