ఈ చెట్ల నుంచి వెలువడే పుప్పొడి వల్ల ఆస్తమా వ్యాధి గ్రస్తులు నరక యాతన అనుభవించాల్సి వస్తుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందే పుప్పొడి రేణువులను పీల్చడం వల్ల ఊపిరి తిత్తుల్లో సమస్యలు ఏర్పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. చర్మ ఎలర్జీలు సంభవిస్తాయి. శ్వాస కోశ సంబంధ వ్యాధి గ్రస్తులు ఈ చెట్టు పరిసరాల్లో ఉండక పోవడం మంచిది. చెట్లు పుష్పించక ముందే శాఖలను ఎప్పటికప్పుడు తొలగించాలి. – లింగమూర్తి,
సీహెచ్‌ఓ, పీహెచ్‌సీ, మిరుదొడ్డి