
దుబ్బాకలో ఆశా వర్కర్లతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
దుబ్బాక: ఆశా వర్కర్లు సమ్మెను వీడి విధుల్లో చేరాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. సోమవారం దుబ్బాకలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐఓసీ) ప్రారంభోత్సవంలో ఆశా వర్కర్లు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో రూ.2 వేలు, రూ.3 వేలు ఉన్న జీతాలు రూ.9 వేలకు పెంచిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. ఆశా వర్కర్ల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని, విధుల్లో చేరాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులున్నారు.