
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి హరీశ్‌రావు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పట్టణ అభివృద్ధిలో వైశ్యులది కీలక పాత్ర అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రంగనాయకుల గుట్ట ఆవరణలో నిర్మించిన వైశ్య సంక్షేమ సంఘం కన్వెన్షన్‌ను మంత్రి ప్రారంభించారు. అంతకు ముందు ఆర్యవైశ్యులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావుకు భారీ గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు ముందంజలో ఉంటారన్నారు. కోమటి చెరువు, కోమటి బండ పేర్లు వైశ్యుల నుంచే వచ్చాయన్నారు. జిల్లా కేంద్రంలో ఈ నెల 5న వెయ్యి పడకల ఆస్పత్రిని ప్రారంభిస్తున్నామన్నారు. రూ.150కోట్లతో రంగనాయక సాగర్ మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సిద్దిపేట ప్రజలే నా కుటుంబ సభ్యులన్నారు. సిద్దిపేట ప్రజలకు నేను ఇచ్చాను తప్ప, ఇంతవరకు వారి నుంచి ఎలాంటి బలవంతపు వసూళ్లు చేయలేదన్నారు. ఈ కన్వెన్షన్ నుంచి వచ్చే ఆదాయం పేద వైశ్యుల అభివృద్ధికి కేటాయించాలని ఈ సందర్భంగా సూచించారు. అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హరీశ్‌రావుకే తమ ఓటు వేస్తామని ఆర్యవైశ్యులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్త, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, టూరిజంశాఖ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.